తెలంగాణ వ్యాప్తంగా శివరాత్రి ని పురస్కరించుకుని శివాలయాల్లో శివనామ స్మరణ తో మారుమోగాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ రాజన్న సన్నిధికి భక్త జనం పోటెత్తారు. రంగారెడ్డి జిల్లా కీసర, మెదక్ జిల్లా ఏడుపాయలు, వరంగల్ జిల్లా కోటి లింగాలు మందిరాల్లో మంగళ వారం శివనామ స్మరణతో మారుమోగింది. రోజంతా ఉపవాస దీక్ష, ప్రత్యేక పూజలు చేసిన భక్తులు దైవ దర్శనం కోసం శివాలయాలకు వెళ్లారు. తెలంగాణ లోని ఆయా శైవ క్షేత్రాల్లో రాత్రంతా జాగరణ చేసిన భక్తులు మరుసటి రోజు ఆయా మందిరాల్లో ఉపవాస దీక్షాలు విరమించారు. వేములవాడ లో రాజరాజేశ్వర స్వామి వారికీ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు.