సాధారణ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై ఎట్టకేల దృష్టి సారించింది చాల కాలం తర్వాత సిఎం కెసిఆర్ ఉద్యోగసంఘాలతో సమావేశం కాబోతున్నారు. ప్రభుత్వ వైఖరిపై ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతున్నా తరుణంలో సిఎం భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో ముందుభాగంలో నిలిచింది ఉద్యోగులు,విద్యార్థులే కానీ రెండు వర్గాలను ప్రభుత్వం పట్టించుకోలేదనే వాదన ఉంది. సరే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సిద్దమయ్యింది. కానీ ఈపాటికే రైతుబంధుకోసం వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తున్న సర్కార్ ఇప్పుడు సందిగ్దం లో ఉంది.

ఉద్యోగులసమస్యలపై ఆర్థిక మంత్రి ఈటెల అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘము కొంత కసరత్తు చేసింది వివిధసంఘాల ప్రతినిధులతో సమావేశాలు జరిపింది. వారి డిమాండుల చిట్టా చాంతాడంత ఉంది. ఒక్క ఆర్ టి సి ఉద్యోగుల డిమాండ్లు తీర్చాలంటేనేరూ 1800కోట్లు అవసరమట. ఇక ఇతర ఉద్యోగుల మాటేమిటి.

1)నూతనవేతన స్థిరీకరణ.

2) మధ్యంతర భృతి .

3) సాధారణ బదిలీలు.

4)ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులను మన రాష్ట్రానికి రప్పించడం.

5)ఆలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు చేయించడం.

6) పదవివిరమణ వయస్సు 60కి పెంచడం.

7) కాంట్రాక్,అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించడం.

ఆర్ టి సి యూనియన్ అయితే తమ సంస్థ కోసం 1000 కోట్లు ఇవ్వాలని పట్టుబడుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాక వచ్చిన తెరాస ప్రభుత్వం ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చింది దీనితో ఉద్యోగులు ఎంతో సంబర పడ్డారు. ప్రతికూలపరిస్థితుల్లోనూఉద్యోగులు ఉద్యమకాలంలో తెరాస వెంటే ఉన్నారు. దీనితో కెసిఆర్ ముఖ్యమంత్రి అవ్వగానే సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాతే మార్పువచ్చింది. ఉద్యోగసంఘాలనాయకులు తెరాస పార్టీ నేతలుగా అవతారం ఎత్తారు. సంఘాలను తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఉన్నతస్థాయిలో దందాలు చేసారు. కనీసం ఉద్యోగులకు సమయం ఇవ్వలేనంత బిజీ అయిపోయారు ముఖ్యంగా ఆంధ్రలోనే ఉండిపోయిన తెలంగాణ ప్రాంత ఉద్యోగులు తమ యూనియన్ నేతల తీరుపై రగిలిపోయారు. ప్రభుత్వభజన పరులుగా మారి పోయి చివరికి ఎదో పదివి తీసుకోని అంధలం ఎక్కేసారు.

అదీగాక యూనియన్ సైతం తమ చెప్పు చేతుల్లోనే పెట్టుకున్నారు. కొత్తగా నాయకత్వంలోకి వచ్చిన వారు గొంతెత్తలేక పోయారు. సో ఉద్యోగుల సమస్యలు పట్టించుకునే నాధుడే లేకుండా పోయారు సహజంగానే ఉద్యోగుల్లో అసంతృప్తి నాటుకుపోయింది. వాస్తవానికి ప్రభుత్వంపై కన్నా యూనియన్ నేతల పైనే ఉద్యోగులు ఇప్పుడు గుర్రుగా ఉన్నారు. సొంత పైరవీలకోసంరోజు సీఎంఓ చుట్టే తిరుగుతున్న నేతలు ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రిటైమ్ ఇవ్వడం లేదని బుకాయించుతున్నారు. యూనియన్ నేతలు ఎంత పోగేసింది ఏ ఏ పైరవీలు చేసింది చిట్టా సిద్ధం చేసిపెట్టుకున్నారు. వారెప్పుడైనా సమావేశాలకు వస్తే భరతం పట్టాలని చూస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ లో ఉద్యోగుల సభలో ఓయూనియన్ నేత మాట్లాడబోతే బండబూతులు తిట్టారు. మరో నేత అటు వైపు కన్నెత్తి చూడలేదు.

తెరాస ముద్రవేసుకున్న సంఘాలుఇప్పుడు అనివార్యంగా మిగితా సంఘాలతో జత కట్టి కదన రంగంలోకి దిగాక తప్పలేదు. మొదటినుంచి ఆందోళనలు చేసేవారి పట్ల కఠినంగా ఉన్న కెసిఆర్ ఒక్క ఉద్యోగుల విషయంలోనే సానుకూలంగా కనిపిస్తున్నారు. మంత్రివర్గ ఉపసంఘము నేడో రేపో పూర్తిస్థాయి నివేదిక ముఖ్యమంత్రి ఇవ్వబోతున్నారు. వెంటనే ముఖ్యమైన ఉద్యోగ సంఘాల నాయకులతో కెసిఆర్ స్వయంగా సమావేశం కాబోతున్నారు. ఎన్నో క్లిష్టమైన సమస్యలు ముందుకు వచ్చే అవకాశం ఉందిగనుక ఆయనే డీల్ చేయబోతున్నారు. ఎన్ని సమస్యలు తీర్చినా యూనియన్ నేతలపై ఉద్యోగుల్లో నెలకొన్న కోపం మాత్రం తగ్గే అవకాశం లేదు.