తెలంగాణ లో తెలుగు దేశం పార్టీని పటిష్టంచేయాల్సిన సీనియర్ నాయకులు కాదు……కాదు వెటరన్ నేతలు ఇప్పుడు ఆ పార్టీకే గుదిబండల మారారు. పార్టీ తలపెట్టే ఏ కార్యనికూడా పట్టించుకోవడం లేదు. కానీ కొత్తవారు పార్టీలోకి వచ్చి చేరకుండ మాత్రం వెనకనుంచి చక్రం తిప్పుతున్నారు. ముఖ్యంగా ఉత్సాహంగా పనిచేసే యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధినేత అనేకమార్లు టీటీడీపీ నేతలకు చెప్తున్నారు కానీ కొత్తవారి కోసంకనీస ప్రయత్నాలు చేయకపోగా స్వచ్చందంగా పార్టీలోకి వస్తామని ముందుకు వచ్చేవారిని ఎదో వంక చెప్పి వెనక్కి లాగేస్తున్నారు. లేదంటే ఏ జిల్లానుంచి ఐతే పార్టీలోకి వస్తామని వస్తారో ఆ జిల్లాలో ఉన్న వెటరన్ నేతలను కలవాలని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పెద్దలు కండిషన్ పెడుతున్నారు.

పోనిలే అని నేతలను కలిసినా ఇప్పుడు వచ్చి ఏమి చేస్తారని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇటీవలే నిజామాబాద్ జిల్లా నుంచి కొందరు యువకులు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ను కలిసారుట ఓ అడుగు ముందుకు వేసి వారిని అమరావతికి తీసుకెళ్లి బాబు కలిపించారట. బాబుకూడా పొంగి పోయారట నాకు మీలాంటి యువతే కావాలి అని బుజం తట్టాడట కానీ నాకుచెప్పకుండనా జిల్లా నుంచి వచ్చినవారిని ఏల బాబు వద్దకు తీసుకెళుతావ్ అంటూ ఓ కమ్మ నేత రమణమీద అరిచాడట వామ్మో ఇదేక్కడి కిరికిరి అనుకోని వాళ్ళను సదురు నేతను కలిశాకే పార్టీలోకి రావాలని షరతు పెట్టాడట. మీ పోజు పాడుగాను అసలు పార్టీకి దిక్కు దివానే లేదుగాని ఇవన్నీ కండిషన్ లు ఏమిటి అని రమణను నిలదీసివెళ్లిపోయారు.

ఇలాంటి పరిస్థితులే తెలంగాణలో అన్ని జిల్లాలోనూ ఉన్నాయంటా. టీటీడీపీ లోని ముఖ్య నాయకులూ కెసిఆర్ తో చేతులు కలిపి ఉన్నారట గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందలం ఎక్కి ఊరేగినవారు ఎన్నో అవకాశాలు పొందినవారే ఇప్పుడు పార్టీకి గుదిబండగా మారిపోయారు. పార్టీ ప్రతికూల పరిస్థితిలో ఉంటే మొఖం చాటేస్తున్నారు సరే అది వారి ఇష్టం కానీ కొత్తగా పార్టీలోకి వచ్చేవారిని ఎదో ఒకటి చెప్పి బెదరగొడుతున్నారు. తెలంగాణరాష్ట్రంఏర్పాటు అయిన ఈ నాలుగేళ్లలోనే తెలుగుదేశం పార్టీ ప్రాబల్యం కోల్పోయింది. నామమాత్రంగా మారిపోయింది. పార్టీ అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగాఉన్నారు. కొత్త రాష్ట్రం కావడంతో అయన పూర్తీ సమయం అక్కడి పాలన వ్యవహారాలు చూడడానికే పరిమితం అయ్యారు.

జగన్ బలమైన ప్రతిపక్ష నేత మారడంతో బాబు తో పాటు లోకేష్ సైతం ఏపీ వ్యవహారాలతోనే సతమతం అవుతున్నారు.హైదరాబాద్ ఉమ్మడి రాజధానే అయినప్పటికీ టీడీపీ అగ్రనేతలెవ్వరు తెలంగాణఫై దృష్టి పెట్టలేకపోతున్నారు. మొదటల్లో ఏపీ సీఎం బాబు తెలంగాణపట్టించుకున్నారు ముఖ్యనాయకులతో క్రమం తప్పకుండా సమావేశాలయ్యారు తెలంగాణలోనూ పార్టీ ప్రాబల్యం పెంచాలని పట్టుబట్టారు. ఏపీ లో అధికారంలో ఉండడంతో చాలామంది సీనియర్ నాయకులు అమరావతి కి వెళ్లి మరీ పనులు చేసుకొన్నారు. ఆర్థికంగా కొంత బలపడ్డారుకూడా. ఏవైనా పనులకోసం వచ్చే టీటీడీపీ నేతల విషయంలో బాబు సానుకూలంగానే పనులు చేసిపెట్టేవారట. కానీ ఓటుకునోటు కేసు తో టీటీడీపీ భవ్యుషత్తే తిరగబడింది. తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాస ను రాజకీయంగా దెబ్బతీయడానికి టీడీపీ నాయకత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది.

కానీ ఈ కాసు తర్వాత ఆపార్టీ నేతలు తెలంగాణ వైపే కన్నెత్తి చూసే సాహసం చేయలేదు. నిజమే ఏపీ లో అధికారంలోకి వచ్చినా బాబు హైదరాబాద్ లో ఓ భారీ ఇంటిని నిర్మించారు దీనితో తెలంగాణలో మరింత పట్టు పెంచుకొనే పనిలో బాబు ఉన్నట్లు గానే అంత భావించారు. కానీ కేసు తర్వాత పరిణామాలు మారిపోయాయి.